BREAKING
పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సానుకూలత

Select Suryaa Now
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సానుకూలత

ముంబై:తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల రంగానికి, సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముంబైలో సమావేశమై ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు.

152 మీటర్ల ఎత్తుపై అధ్యయనానికి అధికారుల కమిటీ

గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 148 మీటర్ల బ్యారేజీ ఎత్తు ఒప్పందాన్ని పునఃపరిశీలించి, ఎత్తును 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులతో ఒక జాయింట్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ నీటి లభ్యత, బ్యారేజీ ఎత్తు, ముంపు విస్తీర్ణం, సాంకేతిక అంశాలతో పాటు పరిహారం చెల్లింపుపై సమగ్ర అధ్యయనం చేయనుంది. కేంద్ర జల సంఘం (CWC) నివేదికలు, కాంటూర్ మ్యాపుల ఆధారంగా ఈ కమిటీ తన నివేదికను అందజేయనుంది.

ముంపు భూములకు పూర్తి పరిహారం: సీఎం రేవంత్‌రెడ్డి

బ్యారేజీ ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర సరిహద్దుల్లో ముంపునకు గురయ్యే భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారమే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లోని గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి ఎద్దడిని తీర్చడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టిపై తదుపరి కార్యాచరణకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్లాలని భేటీలో నిర్ణయించారు.

గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

ఇదిలా ఉండగా, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న "ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్" కు హాజరుకావాల్సిందిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ భేటీతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరపడి, ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుందని సరిహద్దు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.