జనసేన పార్టీలో చేరిక లు
నేటి దినపత్రిక సూర్యబ్యూరో రాజమహేంద్రవరంఆలమూరు మండలం, చొపెల్ల గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం విశేషం.
ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు జనసేన పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక స్వాగతం పలికారు.
చొపెల్ల గ్రామంలో 50 కుటుంబాల చేరికతో జనసేన పార్టీకి మరింత బలం చేకూరింది. ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు సాగుతోందనడానికి ఈ చేరిక నిదర్శనంగా నిలుస్తోంది.