ముక్కామలలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అక్కిన నాగమణి ఇంటింటి ప్రచారం!
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముక్కామల ఎంపీటీసీ 1 నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న అక్కిన నాగమణి అక్టోబర్ 26వ తేదీ సోమవారం గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన మహిళలు, పురుషులు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్న అక్కిన నాగమణి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్లు పెట్టి కూటమి అభ్యర్థి అక్కిన నాగమణికి మద్దతు తెలపాలని కోరారు.గ్రామాభివృద్ధికి కృషి చేసే అవకాశం కల్పించాలని కోరుతూ అక్కిన నాగమణి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.