టీడీపీలో చేరిన 30మంది యువకులు...!
టీడీపీలో చేరిన 30మంది యువకులు...!
- చక్రం తిప్పిన అభ్యర్థి గుంజుపల్లె భాస్కర్ రెడ్డి
- హ్యాట్రిక్ దిశగా టిడిపి 29వ వార్డు అభ్యర్థి
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నందికొట్కూరు పట్టణం కోటవీధి కి చెందిన 30 మంది యువకులు 29వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి గుంజు పల్లె భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు నందికొట్కూరు టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి యువకులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. కోటా వీధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుంజుపల్లె భాస్కర్ రెడ్డి రెండు పర్యాయాలుగా కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొంది పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు .అందులో భాగంగానే టిడిపి 29వ వార్డు అభ్యర్థి గుంజపల్లె భాస్కర్ రెడ్డి మరోసారి టిడిపి పార్టీ హ్యాట్రిక్ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.