టీడీపీలోకి కొనసాగుతున్న వైసీపీ కార్యకర్తల వలసలు
- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, అక్టోబర్ 26, మేజర్ న్యూస్: టెక్కలి నియోజకవర్గంలో వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో వైకాపా
నాయకులు, కార్యకర్తలు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల పరిధిలో ఈ చేరికలు కొనసాగుతున్నాయి, సోమవారం సాయంత్రం నందిగాం మండలం నందిగాం పంచాయతీకి చెందిన 25 మంది వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నిమ్మాడలోని మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుని టీడీపీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారిని మంత్రి అచ్చెన్నాయుడు సాదరంగా ఆహ్వానించారు. టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పాలన, మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంపై తమకున్న విశ్వాసంతో వైకాపా నుంచి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నామని కొత్తగా చేరిన కార్యకర్తలు తెలిపారు.