BREAKING
ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ నీటి వృథాపై జలమండలి కొరడా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు నవంబర్ 20, 21 తేదీల్లో బాలోత్సవాలు ప్రాంతీయ చిత్రం నుంచి ప్రపంచ స్థాయి వరకు: తెలుగు సినిమా అద్భుత ప్రయాణం *అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు* --విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరమా? చర్మ సంరక్షణలో అసలైన రహస్యం ఇదే! వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి తీళ్ల సుభద్రకి పార్టీ బి ఫారం కుమ్మర సంఘం జిల్లా కన్వీనర్ గా అలువాల ఉపేందర్ ప్రజాపతి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం సీతానగరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం టీడీపీ నుంచి వైసీపీ లోకి 30 కుటుంబాలు చేరిక

విత్ డ్రా చేసుకున్న 20 మంది నామినేషన్లు

Select Suryaa Now
విత్ డ్రా చేసుకున్న 20 మంది నామినేషన్లు


ఆమదాలవలస, అక్టోబర్ 26, మేజర్ న్యూస్ 
ఆమదాలవలస మండలంలో  13 ఎంపీటీసీ స్థానాలకు 73 మంది నామినేషన్లు అందజేశారు. ఈ స్థానాలకు సోమవారం విత్ డ్రా 20 మంది అభ్యర్థులు వైదొలిగారు. తమ నామినేషన్లను 20 మంది అభ్యర్థులు వెనక్కి తీసుకోవడంతో ఎన్నికల బరిలో ఇంకను 53 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నామినేషన్ల విత్ డ్రా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్నందున మరి కొంతమంది వెనక్కి తీసుకొని అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఈ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న వారిలో టిడిపి నుంచి కలివరం ఎంపీటీసీ స్థానం నుంచి తమ్మినేని సుజాత, దూసి నుంచి  దవల కళ్యాణి, మునగ వలస నుంచి బొత్స యుగంధర్, కొర్లకోట నుంచి అన్నెపు సరోజిని, రామచంద్రాపురం నుంచి ఇప్పిలి రమణమ్మ, కట్యాచార్యుల పేట నుంచి బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, శ్రీనివాసచార్యుల పేట నుంచి  బొడ్డేపల్లి సీతమ్మ,  కనుగుల వలస నుంచి పొన్నాడ అనసూయమ్మ, నిమ్మ తర్లాడ నుంచి వండాన మౌనిక, నెల్లిపర్తి నుంచి శెట్టి ధనలక్ష్మి, తోటాడ నుంచి హనుమంతు పద్మజ, రామచంద్రాపురం నుంచి తొండరాపు శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కలివరం ఎంపీటీసీ స్థానం తమ్మినేని శారదమ్మ, రామచంద్రాపురం నుంచి చల్ల అప్పలనాయుడు, దూసి నుంచి తిర్లంగి రాములమ్మ, శ్రీనివాసచార్యుల పేట నుంచి గురుగుబెల్లి అమ్మాయమ్మ, తమ్మినేని బాలమణి,  కట్యాచార్యుల పేట నుంచి తమ్మినేని వెంకట్రావు, గురుగుబెల్లి అమ్మాయమ్మ, జనసేన పార్టీ నుంచి కొల్లవలస ఎంపీటీసీ స్థానం నుంచి ఎడ్ల రాంబాబు ఉన్నారు. చాలామంది అభ్యర్థులు ఎన్నికల నుంచి నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో మిగిలిన అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రేపటికి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తెలుస్తుంది.