తుఫాన్ ప్రభావం పై ప్రజలకు అవగాహన
మెలియాపుట్టి. అక్టోబర్ 26. మేజర్ న్యూస్....
మెలియాపుట్టి. అక్టోబర్ 26. మేజర్ న్యూస్ ...
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ టి.రాము, ఎంపీడీవో పి.నరసింహ ప్రసాద్ సూచించారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సోమవారం మండలంలోని రట్టిని గ్రామంలో అధికారులు పర్యటించి ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని కోరారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీచినప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల సమీపంలో నిలబడకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా, అధికారుల సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ రవి, వెలుగు ఏపీఎం త్రినాధమ్మ, సీనియర్ అసిస్టెంట్ జగన్మోహనరావు, ఆర్ఐ. ఆశ, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.