BREAKING
తెలంగాణ ఉద్యమ కారులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన ఉద్యమకారుల అరెస్ట్. ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ నీటి వృథాపై జలమండలి కొరడా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు నవంబర్ 20, 21 తేదీల్లో బాలోత్సవాలు ప్రాంతీయ చిత్రం నుంచి ప్రపంచ స్థాయి వరకు: తెలుగు సినిమా అద్భుత ప్రయాణం *అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు* --విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరమా? చర్మ సంరక్షణలో అసలైన రహస్యం ఇదే! వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి తీళ్ల సుభద్రకి పార్టీ బి ఫారం కుమ్మర సంఘం జిల్లా కన్వీనర్ గా అలువాల ఉపేందర్ ప్రజాపతి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం సీతానగరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం

నిబంధనల ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

Select Suryaa Now
నిబంధనల ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..


- జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సి.హెచ్. తిరుపతి నాయుడు.

శ్రీకాకుళం,అక్టోబర్,26 మేజర్ న్యూస్: ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు 47 కేసులు 48 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ తిరుపతి నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో జరగనున్న అర్బన్/జడ్పీటీసీ/ఎంపిటిసి/పంచాయతి ఎన్నికల సంబంధించి ఎన్నికల కోడ్ అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 2 వరకు అమలులో ఉందన్నారు. జిల్లాలో గల సిబ్బంది అందరికి ఎన్నికల విషయమై ఎక్సైజ్ క్రైమ్ పై తగు నిఘాలు జరిపి చర్యలు తీసుకోనవలసిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. ఒడిశా నుండి NDPL రాకుండా చెక్ పోస్ట్ లను బలోపేతం చేసి టాస్క్ ఫోర్సు విభాగల ద్వారా వివిధ రవాణా మార్గాలను పరిశీలన చేయించడం జరుగుతుందన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 14వ తేదీ నుండి ఇంతవరకు జిల్లాలో (02) నాటుసారాయి కేసులు పట్టి 03 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 150 లీటర్ల నాటుసారాయిను, (03) ఇతర రాష్ట్ర లిక్కర్ (NDPL) కేసులు పట్టి 03 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, 0.73 లీటర్ల లిక్కర్ను మరియు (42) అనధికార మద్యం కేసులు (DPL) పట్టి, 42 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, 57.41 లీటర్ల లిక్కర్ ను స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. మొత్తంగా 47 కేసులు పెట్టి 48 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా వివిధ కేసులలో పట్టుబడిన వ్యక్తులను ఇదివరకే మండల మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరిచి (1103) మందికి bind-over చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ 14 నుండి ఇప్పటి వరకు (32) మందిని bind-over చేయడం జరిగిందని ఆయన వివరించారు.