బట్టే వెంకట కీర్తి ని కార్పొరేటర్ గా గెలిపించండి... మనుమరాలిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటింటా ప్రచారం...
తిరుపతి, మేజర్ న్యూస్ :
తన మనుమరాలు బట్టే వెంకట కీర్తిని 32 డివిజన్ టిడిపి కార్పొరేటర్ గా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ సరోజినీ దేవి లేఔట్ లో సోమవారం ఇంటింటా ప్రచారం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధి లో ఎన్నికల ప్రచారంలో భాగంగా 32వ డివిజన్‌లో టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి ని వెంటబెట్టుకుని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆత్మీయంగా కలిసి సీరియల్ నెంబర్ 1 సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పొలాలు అందుతున్నాయి అన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 908% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దేనని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ, విద్యా దీవెన పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ అందజేయడం జరిగిందన్నారు. తిరుపతి నగరం మరింతగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తో పాటు డివిజన్ కార్పొరేటర్ గా బట్టే వెంకట కీర్తిని గెలిపించాలని ఆమె కోరారు.
వెంకట కీర్తి మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికలలో తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 32వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. డివిజన్‌లో నెలకొన్న jసమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలందిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, పారదర్శక పాలన కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రచారం నిర్వహించారు.
DWARAKA.H
PH.NO:9705347341