పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
ఆమదాలవలస, అక్టోబర్ 26, మేజర్ న్యూస్
ఆమదాలవలస మండలంలో స్థానిక సంస్థల ప్రక్రియ, పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పోలింగ్ విధులపై అప్రమత్తంగా ఉంటూ సజావుగా నిర్వహించేందుకు తగిన సూచనలు పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ నారాయణరావు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సుల వినియోగం, ఓటర్ల గుర్తింపు తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు. విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.ఈ
శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.