BREAKING
ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ నీటి వృథాపై జలమండలి కొరడా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు నవంబర్ 20, 21 తేదీల్లో బాలోత్సవాలు ప్రాంతీయ చిత్రం నుంచి ప్రపంచ స్థాయి వరకు: తెలుగు సినిమా అద్భుత ప్రయాణం *అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు* --విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అవసరమా? చర్మ సంరక్షణలో అసలైన రహస్యం ఇదే! వెంకంపేట ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి తీళ్ల సుభద్రకి పార్టీ బి ఫారం కుమ్మర సంఘం జిల్లా కన్వీనర్ గా అలువాల ఉపేందర్ ప్రజాపతి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం సీతానగరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో ముమ్మరంగా టిడిపి అభ్యర్థుల ప్రచారం టీడీపీ నుంచి వైసీపీ లోకి 30 కుటుంబాలు చేరిక

ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ

Select Suryaa Now
ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ

 

పోలింగ్‌ నిర్వహణపై పీవో, ఏపీవోలకు అవగాహన

మెలియాపుట్టి. అక్టోబర్ 26. మేజర్ న్యూస్ ....
మెలియాపుట్టి మండలం చాపర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి  పీవో, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో పి.నరసింహ ప్రసాద్, తహసీల్దార్‌ టి.రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల విధివిధానాలను వివరించారు.పోలింగ్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సుల వినియోగం, ఓటర్ల గుర్తింపు తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు. విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.