BREAKING
తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని -- అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న రూ. 20 వేలు పోగొట్టుకున్న ఆమెకు కొండంత అండ 92వ వార్డు సమగ్రాభివృద్ధే ధ్యేయం: స్వతంత్ర అభ్యర్థి లీలాదేవి కొనుగోలుదారులతో కిటకిటలాడిన పూర్ణ మార్కెట్ 5వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం..:విత్తనాల మూర్తికి మద్దతుగా పినిపే శ్రీకాంత్, ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి విజయం ఖాయం డ్రైనేజీలను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది 15వ వార్డులో వైసీపీ అభ్యర్థిని సంసాని శ్యామలాదేవి ప్రచార జోరు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం నేటి నుంచే ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర 62వార్డులో ఎన్నికల ప్రచారం హోరు సర్వోదయ శిక్షణతో ప్రజాసేవకు కొత్త స్ఫూర్తి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :మంత్రి సుభాష్ ఎంపీపీ అభ్యర్థిగా జయవరపు శ్రీరామమూర్తి జెడ్పీటీసీ అభ్యర్థిగా కూరపాటి సుజాత, 16 ఎంపీటీసీ స్థానాల్లో జనసేనకు 6, టీడీపీకి 10 స్థానాలు కేటాయింపు 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి చంద్రారెడ్డి విస్తృత ప్రచారం 64వ వార్డులో కూటమి అభ్యర్థి ఈతలపాక సుజాతకు మద్దతుగా వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ప్రచారం

తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు

Select Suryaa Now
తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి  తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు

ఆత్రేయపురం మేజర్ న్యూస్ తుఫాను ప్రభావం పై ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో పివిఆర్ కే రాజు తాసిల్దార్ శ్రీ రామచంద్రమూర్తి అన్నారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అందరు మండల స్థాయి అధికారులతో, పంచాయితీ అభివృద్ధి అధికారులతో గ్రామ రెవెన్యూ అధికారులతో తుఫాను ప్రభావం, దాని వల్ల సంభవించే నష్టాలను నివారించేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు మరియు చేపట్టవలసిన చర్యలపై  సమావేశం  నిర్వహించారు ఈ సమావేశంలో తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.  

అందరు పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామ పంచాయతీల పరిధిలో తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలు, పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, ప్రమాదకరమైన చెట్లు, విద్యుత్ స్తంభాలు మరియు ప్రజలకు ప్రమాదం కలిగించే ఇతర ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అలాగే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి కాలువల్లో అడ్డంకుల తొలగింపు, వర్షపు నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవడం, రహదారులపై పడిపోయే చెట్లు లేదా ఇతర అడ్డంకులను తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. తుఫాను కారణంగా ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు సంబంధిత సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలి. 

గ్రామ రెవెన్యూ అధికారులు  పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. తుఫాను ప్రభావానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని, నష్టం వివరాలను మరియు తీసుకున్న చర్యలను ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి సూచించారు ఈ సమావేశములో  మండల స్థాయి అధికారులు,  అందరు పంచాయితీ కార్యదర్శులు, మరియు  గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు.