కొనుగోలుదారులతో కిటకిటలాడిన పూర్ణ మార్కెట్
ఆర్నబ్ తుఫాన్ భయంతో కూరగాయలు, సరుకులు కొనుగోలు
విశాఖపట్నం, అక్టోబర్ 26, మేజర్ న్యూస్ : ఆర్నబ్ తుఫాన్ ముప్పు భయంతో కూరగాయలు, కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు జనం ఎగబడ్డారు. సోమవారం సాయంత్రం నుంచి ఇక్కడ పది వరకు పూర్ణ మార్కెట్ కూరగాయలు కొనుగోలుదారులతో కిటకిట లాడింది. దీంతో వర్తకులు ధరలను రెండింతలు పెంచి అమ్మకాలు జరిపారు. పూర్ణ మార్కెట్ లోపల రోడ్డు మీద దుకాణా లన్ని కొనుగోలుదారులతో నిండిపోయాయి. మార్కెట్ లోపల వెలుప ల పరిసరాలు ఎక్కడ చూసినా జనంతో వచ్చాయి. అన్ని రకాల పండ్లు ధరలు ఒక్కసారిగా పెంచి వర్తకులు అమ్మకాలు జరిపారు. రెండు రోజులపాటు తుఫాన్ భయంతో జనం వెనక్కు జంకకుంట వ్యాపారస్తులు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు చక్రాల బళ్ళు, రోడ్డుమీద వ్యాపారాలు భారీగా అమ్మకాలు జరిగాయి.
ట్రాఫిక్ ఇబ్బందులు..
పూర్ణ మార్కెట్ లో వాహన దారులు ఇబందులు పడ్డారు. మెయిన్ రోడ్ నుంచి దుర్గమ్మ గుడి వైపు వెళ్లే వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయాయి. వాహనాలు పార్కింగ్ తో కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు గాలికి వదిలేసారు. ట్రాఫిక్ పోలీసులు కేవలం దుర్గమ్మ గుడి దగ్గర కూర్చోడానికి పరిమితం కాక మెయిన్ రోడ్డు దగ్గర ట్రాఫిక్ పోలీసులు జాడ కాన రాలేదు.