అరకులోయ వైయస్సార్సీపి జెడ్పీటీసీ అభ్యర్థిగా అశోక్
అరకులోయ, అక్టోబర్ 26, మేజర్ న్యూస్:అరకులోయ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ యువ నాయకుడు కమ్మిడి అశోక్ ను ఆ పార్టీ అగ్రనేతలు ఎంపిక చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు పర్యాయాలు సమావేశమై దీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం పార్టీకి విశేష సేవలందిస్తున్న కమ్మిడి. అశోక్ పేరును ఖరారు చేస్తూ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షుడు,పాడేరు శాసనసభ్యుడు మత్స్యరాస.విశ్వేశ్వరరాజు, అరకులోయ ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం చేతుల మీదుగా అరకులోయ మండల వైయస్సార్సీపి జెడ్పీటీసీ అభ్యర్థి కమ్మిడి. అశోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి-ఫాం సోమవారం అందుకున్నారు.జెడ్పీటీసీ టికెట్ కోసం పార్టీలోని అనేకమంది నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు.జెడ్పీటీసీ టికెట్ ను ఆశిస్తూ చాలామంది లాబీయింగ్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.ముందుగా ఎమ్మెల్యే తనయుడు రేగం. చాణక్యను జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేశారు. పార్టీ యువ నాయకుడు రేగం.చాణక్య అభ్యర్థిత్వంపై పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన సైనికుడిగా,నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న కమ్మిడి.అశోక్ ను పార్టీ అధిష్టానం జెడ్పీటీసీగా అవకాశం కల్పించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగినప్పటికీ ఎట్టకేలకు అశోక్ కు అదృష్టం వరించింది.కమ్మిడి.అశోక్ ను జెడ్పీటీసీ అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేయడం వెనుక ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగం కృషి దాగి ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.కమ్మిడి. అశోక్ జెడ్పీటీసీ అభ్యర్థిగా బి ఫామ్ అందుకోవడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థి కమ్మిడి.అశోక్ విలేకరులతో మాట్లాడుతూ
తనపై నమ్మకం ఉంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అరకులోయ ఎమ్మెల్యే రేగం. మత్స్యలింగంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు.అదేవిధంగా తనకు అండగా నిలిచిన మండల నాయకులకు,మాజీ ఎంపీటీసీలకు,మాజీ సర్పంచ్ లకు,కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మండల అభివృద్ధికి,గిరిజన ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని,రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను జెడ్పీటీసీ అభ్యర్థి కమ్మిడి.అశోక్ విజ్ఞప్తి చేశారు.