వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిముడు హరి
డుంబ్రిగుడ, అక్టోబర్ 26, మేజర్ న్యూస్:
డుంబ్రిగుడ మండల వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిగా కిముడు హరికి దక్కింది. జిల్లా పాడేరులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే మత్స్యలింగం భీఫారాన్ని అందజేశారు. పాడేరు ఐటీడీఏలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలో ఎమ్మెల్యేతో కలిసి ఆయన బీఫారాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజకు అందజేశారు. ఎంపికయ్యిన మండల ప్రాదేశిక సభ్యులకు భీఫారాలను అందజేశామని ఎమ్మెల్యే మత్స్యలింగం తెలిపారు.