BREAKING
యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి సత్యనిష్ఠతోనే నిజమైన సమృద్ధి: మాజీ డీజీపీ రవి గుప్తా ఎన్నికల నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ.. ఉయ్యూరుకు కావాల్సింది మాటలు కాదు.. అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎల్ ని నో పై కళాజాత వికసిత్ భారత్ సాధనలో ఎస్కీ పాత్ర కీలకం: కల్నల్ హర్పాల్ సింగ్ బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొండంత అండ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్ వెంకన్న! ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ఉద్యమ కారులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన ఉద్యమకారుల అరెస్ట్. ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విశాఖ ఆస్తులను కాపాడుకుందాం!

Select Suryaa Now
విశాఖ ఆస్తులను కాపాడుకుందాం!

- కూటమి పాలనలో నగర అభివృద్ధి నిర్వీర్యం
- ఆరు గ్యారెంటీల అమలుపై సమాధానం చెప్పాలి
- గీతం భూములు, స్టీల్‌ప్లాంట్‌, సింహాచలం భూముల పరిరక్షణకు తీర్మానాలు
- విశాఖను దేశంలో టాప్‌-5 నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- వైకాపా మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి

విశాఖపట్నం, (మేజర్ న్యూస్): కూటమి ప్రభుత్వం నుంచి విశాఖ ప్రజల ఆస్తులను కాపాడుకోవాలని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో వైకాపా జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి పాలనలో విశాఖ అభివృద్ధి కుంటుపడిందని, కొండల విధ్వంసం, భూకబ్జాలు, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.54 వేల బకాయిలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలుపై సమాధానం చెప్పిన తర్వాతే కూటమి నేతలు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. వైకాపా విజయం సాధిస్తే అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని కల్యాణి హామీ ఇచ్చారు. గీతం భూములు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, సింహాచలం భూముల పరిరక్షణపై జీవీఎంసీలో తీర్మానాలు చేస్తామన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, కాలుష్య నియంత్రణ, పార్కులు, హెల్త్‌ అరేనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మహిళల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. విశాఖను దేశంలోని అగ్ర ఐదు నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం 'సేవ్ వైజాగ్' నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, మాజీ మేయర్ గోలగాని హరి వెంకటకుమారి, మొల్లి అప్పారావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు.