BREAKING
అభివృద్ధి పనులకు సిఎస్ఆర్ నిధులు కేటాయించండి యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి సత్యనిష్ఠతోనే నిజమైన సమృద్ధి: మాజీ డీజీపీ రవి గుప్తా ఎన్నికల నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ.. ఉయ్యూరుకు కావాల్సింది మాటలు కాదు.. అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎల్ ని నో పై కళాజాత వికసిత్ భారత్ సాధనలో ఎస్కీ పాత్ర కీలకం: కల్నల్ హర్పాల్ సింగ్ బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొండంత అండ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్ వెంకన్న! ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ఉద్యమ కారులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన ఉద్యమకారుల అరెస్ట్. ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

Select Suryaa Now
కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. చిత్తూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల సంక్షేమం, నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు  దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు నగరం లోని దుర్గా నగర్ కాలనీ, మిట్టూరు ప్రాంతాలలో కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలత  తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో  ఎంపి, ఎమ్మెల్యేలు.., మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ జిల్లా అధ్యక్షులు సి. ఆర్. రాజన్,పాల్గొని, ఇంటింటికి వెళ్లి  కరపత్రాలు పంచుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ... చిత్తూరు నగర అభివృద్ధికి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తిస్థాయిలో తీసుకొచ్చి నగర రూపురేఖలను మారుస్తామని తెలిపారు.ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం మరియు సుపరిపాలన అందించాలంటే కూటమి అభ్యర్థి గెలుపు ఎంతో అవసరమన్నారు.చిత్తూరు నగర ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. కూటమి బలపరిచిన మేయర్ అభ్యర్థి  కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించి, నగర అభివృద్ధికి బాటలు వేయాలని చిత్తూరు నగర ప్రజలకు ఎంపీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.