BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

ఎంపీపీ అభ్యర్థిగా జయవరపు శ్రీరామమూర్తి జెడ్పీటీసీ అభ్యర్థిగా కూరపాటి సుజాత, 16 ఎంపీటీసీ స్థానాల్లో జనసేనకు 6, టీడీపీకి 10 స్థానాలు కేటాయింపు

Select Suryaa Now
ఎంపీపీ అభ్యర్థిగా జయవరపు శ్రీరామమూర్తి జెడ్పీటీసీ అభ్యర్థిగా కూరపాటి సుజాత, 16 ఎంపీటీసీ స్థానాల్లో జనసేనకు 6, టీడీపీకి 10 స్థానాలు కేటాయింపు

బుట్టాయిగూడెం: సూర్య న్యూస్:. నర్సాపురం మండల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు.సోమవారం బుట్టాయిగూడెంలో నాయకులు గద్దే అబ్బులు నివాసంలో నిర్వహించిన కూటమి పార్టీల సమావేశంలో టి. నర్సాపురం మండలానికి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా కూరపాటి సుజాతను, ఎంపీపీ అభ్యర్థిగా జయవరపు శ్రీరామమూర్తిని ప్రకటించారు.మండలంలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీకి 6 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు కేటాయించినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్‌తో పాటు కూటమి ముఖ్య నాయకులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ప్రజల మద్దతుతో అన్ని స్థానాల్లో విజయానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పొట్టా రామారావు, శీలం వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, మొగపర్తి సోంబాబు, పిన్నమనేని మధు, నాయుడు రామకృష్ణ గౌడ్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జల ఇంచార్జ్ ఏలూరు,