92వ వార్డు సమగ్రాభివృద్ధే ధ్యేయం: స్వతంత్ర అభ్యర్థి లీలాదేవి
గాజువాక, మేజర్ న్యూస్ : జీవీఎంసీ 92వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని ఆ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి పెంటకోట లీలాదేవి అన్నారు. దయాల్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కొండవాలు ప్రాంతాలకు జీవీఎంసీ తాగునీరు అందించడంతో పాటు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పెంటకోట శంకర్రావు మాట్లాడుతూ.. వర్షాలు, తుపాన్ల సమయంలో కొండవాలు ప్రాంతాల ప్రజల భద్రత కోసం రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్నారు. జీవీఎంసీ, రెవెన్యూ సమస్యల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, స్థానికంగానే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. అందరికీ ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తమ 'ఫ్లూటు' గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.