62వార్డులో ఎన్నికల ప్రచారం హోరు
ఫ్యాను గుర్తుకు ఓటు వేసి విశాఖను కాపాడండి అని ప్రజలను కోరిన నాయకులు
సీతమ్మధార, మేజర్ న్యూస్ : జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పర్వీన్ ఆధ్వర్యంలో 62 వార్డులో శివనగర్ లో దుర్గాలమ్మ, బంగారమ్మ గుడి లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం శివనగర్,హర్ష నగర్, గ్రీన్ గార్డెన్స్, హుస్సేన్ నగర్,సాయి నగర్లో జరిగిన భారీ ర్యాలీలో విశాఖ జిల్లా అధ్యక్షలు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు , మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి కి, 62వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పర్వీన్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు భర్కట్ అలీ,రొంగాలి జగన్నాధం, మహమ్మద్ ఫరూక్, పీలా వెంకటలక్ష్మి, కె వి బాబా, జి వి రమణి,బి రాధ,కిరణ్ రాజు,పీలా ఉమారాణి 62 వార్డు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.