BREAKING
స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష భారత్‌తో టీ20 సిరీస్ పరాజయంపై కివీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు: కీలక సమయాల్లోనే చేజార్చుకున్నాం బంగాళాఖాతంలో సైక్లోన్ అర్నబ్.. తీర ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు? ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ఈయూ సుంకాలకు చెక్.. యూరప్‌లోనే సొంత తయారీ ప్లాంట్లను వేగవంతం చేస్తున్న చైనా ఈవీ దిగ్గజాలు! వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిముడు హరి ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి.. అరకులోయ వైయస్సార్సీపి జెడ్పీటీసీ అభ్యర్థిగా అశోక్ చెన్నైలో తనుష్ సంస్థ ఆధ్వర్యంలో మహిళల మహాసభ: ప్రత్యేక కానుకగా వెండి దీపాలు గ్లోబల్ స్థూల ఆర్థిక ప్రతికూలతలు, ముడి చమురు ఒడుదొడుకులే కమోడిటీ మార్కెట్ల దిశానిర్దేశం.. కొటక్ నియో కీలక విశ్లేషణ! స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ కుట్ర కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి విశాఖ ఆస్తులను కాపాడుకుందాం! విత్ డ్రా చేసుకున్న 20 మంది నామినేషన్లు ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ

టిడిపి అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి విజయం ఖాయం

Select Suryaa Now
 టిడిపి అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి విజయం ఖాయం

- హోరెత్తిస్తున్న ఏడువాక  ప్రచారాలు

ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ,16వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివాజీ నగర్–2 పరిధిలో ముత్యమాంబ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనంతరం, 40 గజాల ఏరియా, జేఎన్ఎన్‌యూఆర్‌ఎం బ్లాకుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థిని తెలిపారు. ప్రచారంలో భాగంగా జీవీఎంసీ మేయర్ అభ్యర్థిని కుమారి ముక్క శ్రావణి, 16వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు ఇద్దరికీ సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ప్రచారానికి ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం
ప్రచార సమయంలో పలుచోట్ల స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ, పూలవర్షం కురిపించారు. స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ మద్దతును తెలియజేయడంతో ప్రచార ప్రాంతాల్లో సందడి నెలకొంది. ప్రచారంలో టిడిపి సీనియర్ నాయకుడు తురకపూడి బాలస్వామి, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.