15వ వార్డులో వైసీపీ అభ్యర్థిని సంసాని శ్యామలాదేవి ప్రచార జోరు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి.
అమలాపురం, మేజర్ న్యూస్ :మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 15వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని సంసాని శ్యామలాదేవి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వైసీపీ నాయకుడు సంసాని చంద్రశేఖర్ (బుల్లి నాని) సతీమణి అయిన శ్యామలాదేవి, గత ఐదేళ్లలో తన భర్త వార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకుని తనను ఆదరించాలని కోరుతున్నారు. విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో చేసిన కృషిని పరిగణనలోకి తీసుకోవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
మరోవైపు, సంసాని చంద్రశేఖర్ సైతం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ఓటర్లను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
15వ వార్డులో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు శ్యామలాదేవి, సంసాని చంద్రశేఖర్ చేస్తున్న ప్రచారం ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.