హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి
హామీలు అమలు చేశారా.. లేదా.. ఆలోచించి ఓటు వేయండి
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు , వాగ్దానాలను.. రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతవరకు అమలు చేశారు.. లేదో.. ఆలోచన చేసి.. అనంత నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓట్లు వేయాలని రెండవ డివిజన్ వైసిపి, సిపిఐ కార్పొరేటర్ అభ్యర్థి సిరిసాల కుల్లాయమ్మ డివిజన్ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వైసిపి, సిపిఐ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్ లో మేయర్ అభ్యర్థి సి రమేష్ గౌడ్ సతీమణి, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సిరిసాల కుల్లాయమ్మలు రెండవ డివిజన్ లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ.. నగరపాలక సంస్థ ఎన్నికలలో
వైసిపి అభ్యర్థులను గెలిపిస్తే... నగరాభివృద్ధి, డివిజన్ అభివృద్ధికి చేపట్టబోయే.. ప్రణాళికలను వివరించారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు , ప్రస్తుత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో... ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ ప్రధాన హామీ అయిన ఆడబిడ్డ నిధి పథకం కింద రూ.1500 ఇవ్వకుండా మహిళలను దగా చేశారని, దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి .. కేవలం ఒక సంవత్సరం మాత్రమే అరకొరగా సిలిండర్లు ఇచ్చి... చేతులు దులుపుకొని... ప్రజలకు ద్రోహం చేశారని వివరించారు. తాము అధికారంలోకి వస్తేనే 50 సంవత్సరాల నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు పింఛన్ అందిస్తామని.. హామీ ఇచ్చి... ఇప్పటికి రెండున్నర సంవత్సరాలైనా .. ఒక్కరికి కూడా కొత్త పింఛన్ ఇవ్వలేదని... నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.... ఇంతవరకు అమలు చేయకుండా తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
అధికారమే లక్ష్యంగా.. కూటమి పార్టీలు హామీ ఇచ్చింది తప్ప.. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.
మరోసారి కూటమి ప్రభుత్వానికి.. ఓటు వేసి గెలిపిస్తే... మళ్లీ యధా ప్రకారం... ప్రజలను పట్టించుకోరని... మరోసారి ప్రజలు మోసపోవద్దని.. వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.