BREAKING
తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని -- అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న రూ. 20 వేలు పోగొట్టుకున్న ఆమెకు కొండంత అండ 92వ వార్డు సమగ్రాభివృద్ధే ధ్యేయం: స్వతంత్ర అభ్యర్థి లీలాదేవి కొనుగోలుదారులతో కిటకిటలాడిన పూర్ణ మార్కెట్ 5వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం..:విత్తనాల మూర్తికి మద్దతుగా పినిపే శ్రీకాంత్, ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి విజయం ఖాయం డ్రైనేజీలను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది 15వ వార్డులో వైసీపీ అభ్యర్థిని సంసాని శ్యామలాదేవి ప్రచార జోరు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం నేటి నుంచే ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర 62వార్డులో ఎన్నికల ప్రచారం హోరు సర్వోదయ శిక్షణతో ప్రజాసేవకు కొత్త స్ఫూర్తి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :మంత్రి సుభాష్ ఎంపీపీ అభ్యర్థిగా జయవరపు శ్రీరామమూర్తి జెడ్పీటీసీ అభ్యర్థిగా కూరపాటి సుజాత, 16 ఎంపీటీసీ స్థానాల్లో జనసేనకు 6, టీడీపీకి 10 స్థానాలు కేటాయింపు 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి చంద్రారెడ్డి విస్తృత ప్రచారం 64వ వార్డులో కూటమి అభ్యర్థి ఈతలపాక సుజాతకు మద్దతుగా వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ప్రచారం

జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు

Select Suryaa Now
జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు

 

 జిన్నారం:జిన్నారం మున్సిపల్ కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచే పరిపాలన సాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మున్సిపల్ బిజెపి శాఖ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ ప్రధాన చౌరస్తా లో భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీతో జిన్నారం దద్దరిల్లిపోయింది. అనంతరం తాసిల్దార్ అంటోనీకి బిజెపి నాయకులు ,కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ కేంద్రంలోనే డీఎస్పీ కార్యాలయాన్ని నిర్మించి, ఇక్కడి నుంచే పోలీసు పరిపాలన కొనసాగించాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం జిన్నారం కేంద్రంగా డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, కొందరు నాయకులు, అధికారులు కార్యాలయాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిన్నారం పేరుతో ఇతర ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిన్నారంలోనే డీఎస్పీ కార్యాలయాన్ని నిర్మించి, స్థానిక ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన ర్యాలీలో మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఉమ్మడి మండలానికి చెందిన బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు నర్సింగరావు, అశోక్ కుమార్, రాజిరెడ్డి, సుధాకర్, పల్నాటి శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.