telangana
రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.;; రైతుల పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం సాయంత్రం మామడ మండలం పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ, ఖానాపూర్ మండలం మేడంపల్లి సదర్మాట్, కడెం మండలం కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ గ్రామాల్లోని చివరి ఆయకట్టు పంటలను పరిశీలించారు.ముందుగా మామడ మండలం పొన్కల్ వద్ద గల సదర్మాట్ ప్రాజెక్టును పరిశీలించారు. సంబంధిత అధికారుల నుంచి ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుత నీటి నిల్వ వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఆ తర్వాత ఖానాపూర్ మండలం మేడంపల్లి గ్రామం వద్ద సదర్మాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. సదర్మాట్ ప్రస్తుత పరిస్థితిని చూశారుఅనంతరం కడెం మండలం కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ గ్రామాల్లో చివరి ఆయకట్టు రైతుల పంటలు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజీలో ప్రస్తుతం ఒక టిఎంసి నీరు అందుబాటులో ఉందని, రైతుల పంటలు కోతల దశకు చేరుకున్నాయని, లభ్యంగా ఉన్న నీటిని రైతుల పంటలకు అవసరమైన మేరకు అందిస్తామన్నారు. నది పరివాహకం మధ్యలో ఉన్న నీటి మళ్లింపులు తొలగిస్తే, పంటలకు నీరు అందివ్వడంలో ఇబ్బంది ఉండదు అని పేర్కొన్నారు. నీటిని వృధా చేయవద్దని సూచించారు. రైతులు ఆందోళన చెందకూడదన్నారు.
పాత మద్దిపడగ గ్రామంలో తాగునీటి సమస్యను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, స్పందించిన కలెక్టర్ తాగునీటి సమస్య తీర్చేందుకు ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్లోరిన్ సమస్య లేని ప్రాంతాన్ని గుర్తించి, బోర్ వెల్ వేయించి నీటిని అందిస్తామని తెలిపారు.
ఈ పర్యటనల్లో నీటిపారుదల శాఖ ఈఈ ప్రవీణ్, డిఈ సురేందర్, తహసిల్దార్లు శ్రీనివాస్, సుజాత, ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవోలు విజయ్ కుమార్, సునీత, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.