ప్రజలు తమ ఓటుతో మంచికి పట్టం కట్టాలి -- ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు
ఏలూరు, మేజర్ న్యూస్ :ఇది మన ఏలూరు, ఈ నగరాభివృద్ధి మన బాధ్యత అంటూ ఎమ్మెల్యే బడేటి చంటి చేసిన గర్జనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల రణం మరింత వేడెక్కింది. గత వైసీపీ పాలకుల అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిళించేందుకూ, ఏలూరును మరింత అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించేందుకూ ప్రజల ముందు కార్పొరేషన్ ఎన్నికల అవకాశం ఉందని, ప్రజలు తమ ఓటుతోనే మంచికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు నిచ్చారు. ప్రతీ డివిజన్‌లోనూ కూటమి ప్రభంజనం సృష్టిస్తోందని, రికార్డు మెజారిటీలతో కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదేక్రమంలో స్థానిక 55, 43 డివిజన్‌ల పరిధిలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సమావేశంలో కూటమి మేయర్ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, ఏలూరును అభివృద్ధి చేసుకునేందుకు బాధ్యతాయుతంగా ముందుకు కదలాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విషయంలో కూటమికే ఎందుకు మద్దతుగా నిలవాలనే అంశంపై ప్రజల్లో ఎమ్మెల్యే స్ఫూర్తినింపారు స్ఫూర్తిని నింపిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, దాష్టికాలతో విధ్వంసాలు సృష్టించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోన్న వైసీపీ నేతల మాటలను వినిపించుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రతిస్పందించారు. తన గెలుపునకు బాసటగా నిలిచిన వారి విజయం కోసం తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని, తద్వారా మంచి కూటమి మేయర్ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడు ను, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధించిన ఓటుహక్కునుఉం సమాజానికి విద్రోహం కలిగించే వైసీపీకి కాకుండా అనునిత్యం ప్రజలకు మంచి చేయాలని భావించే కూటమి అభ్యర్ధులకు వేసి అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటి మేయర్ శిరిపల్లి ప్రసాద్, ఈడా మాజీ ఛైర్మన్ బొద్దాని శ్రీనివాస్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు వందనాల శ్రీనివాస్, 55వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధిని వందనాల దుర్గాభవానీ, 43వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధి బడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.