telangana
ఆర్థికంగా వెనుకబడిన 22 మంది విద్యార్థులకు ఆవోపా ఆర్థిక చేయూత
సూర్య కరీంనగర్ ;;ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) కరీంనగర్ టౌన్ ఆధ్వర్యంలో 22 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు పుస్తకాల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.1,10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 23 మంది దాతల ఉదార సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆవోపా కరీంనగర్ టౌన్ అధ్యక్షులు నలుమాసు సుదర్శనం మాట్లాడుతూ, విద్య ద్వారానే విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ పుస్తకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది నిరుపేద విద్యార్థులకు చేయూతనందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు శాశ్వత విద్యానిధి ఏర్పాటు చేయడానికి తామంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ నారాయణ, పి.వి. రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు కొమురవెల్లి వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత ఈశ్వర్ ప్రసాద్, కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కంటాల రామ్మోహన్, ఆవోపా కరీంనగర్ టౌన్ ప్రధాన కార్యదర్శి వల్లాల సత్యనారాయణ, కోశాధికారి కట్కూరి చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు నలుమాచు చంద్రశేఖర్, రాచర్ల వసంతం ముస్త్యాల సతీష్, అయిత యోగేంద్ర ప్రసాద్, పీఆర్వో పుల్లూరి రవీందర్, గోగుల రాములు, విశ్వనాథం రమేష్, సముద్రాల చంద్రమౌళి, సముద్రాల ఆంజనేయులు, కట్కూరి రవీందర్, బోడ్ల శ్రీశైలం, బండ లక్ష్మీనారాయణ, ముక్కా నారాయణ పాత గంగాధర్ జిల్లా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.