డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి
ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : 54వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను ఆశీర్వదించాలని 54వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శాంతి సోమవారం రాయల్ వారి వీధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి మహిళతో నేరుగా మాట్లాడి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే డివిజన్ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తానన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే ప్రజాప్రతినిధిగా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, పారదర్శక పాలనకు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనకు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను శాంతి కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్