BREAKING
ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టాలి జాతీయ స్థాయి మల్లకంభ పోటీలకు విజ్ఞాన విహార విద్యార్థులు

మద్ది గ్రామంలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

Select Suryaa Now
మద్ది గ్రామంలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్

ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పోలీస్ శాఖ కవాతు

ధైర్యంగా ఓటేయండి అంటూ ప్రజలకు భరోసా

సిపి ఆదేశాల మేరకు కవాతు: సిఐ చంద్రమౌళి వెల్లడి

పద్మనాభం, మేజర్ న్యూస్ : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పద్మనాభం పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంకబ్రత బాగ్చి, డీసీపీ-1 మణికంఠ ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్ది గ్రామంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పద్మనాభం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి తెలిపారు. నార్త్ సబ్ డివిజన్ ఏసిపి అప్పలరాజు  పర్యవేక్షణలో, పద్మనాభం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో నార్త్ సబ్-డివిజన్ పోలీసు సిబ్బందితో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతు చేస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని నింపారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయవచ్చని భరోసా కల్పించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని, ఎవరి ఒత్తిడికి, బెదిరింపులకు భయపడవద్దని, స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.