BREAKING
కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ! జడ్పిటిసి పీఠం ఎవరికి?. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా 'ఉడ్తా తిర్' జోరు మందగమనం: మొదటి సోమవారం భారీగా పడిపోయిన కలెక్షన్లు ఆటో మార్జిన్లు అప్: వాల్యూమ్స్, ప్రీమియమైజేషన్‌తో పుంజుకోనున్న రంగం! మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి అక్షయ్ కుమార్ 'మొహ్రా': 4కే వర్షన్‌లో రీ-రిలీజ్ ఎన్నికల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కీలక సూచనలు దూసుకు వస్తున్న ఆర్నాబ్ తుఫాన్.... నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ... స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష భారత్‌తో టీ20 సిరీస్ పరాజయంపై కివీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు: కీలక సమయాల్లోనే చేజార్చుకున్నాం బంగాళాఖాతంలో సైక్లోన్ అర్నబ్.. తీర ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు? ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ఈయూ సుంకాలకు చెక్.. యూరప్‌లోనే సొంత తయారీ ప్లాంట్లను వేగవంతం చేస్తున్న చైనా ఈవీ దిగ్గజాలు! వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిముడు హరి ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి.. అరకులోయ వైయస్సార్సీపి జెడ్పీటీసీ అభ్యర్థిగా అశోక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల్లో ధన ప్రభావం, ప్రలోభాల పంపిణీని అరికట్టాలని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు  శివకుమార్ గంగాల్, IFS ఆదేశించారు.

జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ

ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, ఇతర ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అలాగే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు, పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాల్లో ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ అధికారి, జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ అధికారి శ్రీ ఏ.వి.వి. సత్యనారాయణ, సీనియర్ ఆడిటర్లు శ్రీ సి.హెచ్. మురళీకృష్ణ, శ్రీ ఆర్.భీమేశ్వరరావు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితులు

పదవి / వర్గం| ఖర్చు పరిమితి (రూ. లక్షల్లో)

జనాభా 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్| 4.00

జనాభా 10,000 కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్| 2.50

జనాభా 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు| 1.00

జనాభా 10,000 కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు| 0.60

జెడ్పీటీసీ అభ్యర్థి| 8.00

ఎంపీటీసీ అభ్యర్థి| 4.00

మున్సిపల్ చైర్‌పర్సన్| 20.00

మున్సిపల్ కౌన్సిలర్| 1.50

నగర పంచాయతీ చైర్‌పర్సన్| 10.00

నగర పంచాయతీ కౌన్సిలర్| 5.00

ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల వ్యయ నియంత్రణపై సంబంధిత అధికారులు నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు