BREAKING
సీతానగరం మండలంలో ప్రభుత్వ భూముల పరిశీలన ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ! జడ్పిటిసి పీఠం ఎవరికి?. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా 'ఉడ్తా తిర్' జోరు మందగమనం: మొదటి సోమవారం భారీగా పడిపోయిన కలెక్షన్లు ఆటో మార్జిన్లు అప్: వాల్యూమ్స్, ప్రీమియమైజేషన్‌తో పుంజుకోనున్న రంగం! మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి అక్షయ్ కుమార్ 'మొహ్రా': 4కే వర్షన్‌లో రీ-రిలీజ్ ఎన్నికల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కీలక సూచనలు దూసుకు వస్తున్న ఆర్నాబ్ తుఫాన్.... నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ... స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష

ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ

Select Suryaa Now
ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ

                                              స్థానిక నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం

అంబాజీపేట మేజర్ న్యూస్ :అంబాజీపేట మండలం వాకలగరువు - తొండవరం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి కడలి చంద్రకళ సుబ్బారావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం వాకలగరువు బుల్లియ్య కాలనీ, రజకపేటలలో ఆమె పర్యటించారు. తొలుత బుల్లియ్య కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శివారు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, తాగునీటి వసతి, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదని ప్రజలు తమ ఇబ్బందులను అభ్యర్థి దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇస్తే శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి అండగా ఉండాలని ఆమె కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వాకపల్లి శ్రీనివాసరావు, మద్దింశెట్టి పుల్ల నాయుడు, కేతా రాజు, గోగు శ్రీరామమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు కాండ్రేగుల నాగబాబు, సిద్దాబత్తుల శ్రీను, చప్పిడి రాజు, కొత్తపల్లి సత్తిపండు, వెంకన్న బాబు, రాంబాబు, నౌండ్రు సుదర్శన్, గోసఘి రామకృష్ణ, తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.