ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్
మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన కొండపర్తి గణపతి సూర్య భగవాన్, సుమలత రాధా దంపతులు నిర్వహించినట్లు శ్రీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సోమవారం తెలిపింది. తమ కుమారులు కిరణ్, నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా వారు భిక్షాదాతలుగా వ్యవహరించినట్లు పేర్కొంది.
ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కూనా పార్వతి, బాకీ శ్రీనివాస్ రెడ్డి, పోలు మాల్యాద్రి రెడ్డి, కొల్లెపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు తదితరులు పాల్గొన్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,