BREAKING
భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం

జేగురుపాడులో కూటమి ప్రచార జోరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో విస్తృత పర్యటన!

Select Suryaa Now
జేగురుపాడులో కూటమి ప్రచార జోరు.  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో విస్తృత పర్యటన!

కడియం మేజర్ న్యూస్, కడియం మండలం జేగురుపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గ్రామ ప్రజలను, స్థానిక నాయకులను ఆత్మీయంగా కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ ఉప మేయర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం జడ్పీటీసీ కూటమి అభ్యర్థి రత్నం అయ్యప్ప, ఎంపీటీసీ కూటమి అభ్యర్థి బోడపాటి గోపి పాల్గొన్నారు.
జేగురుపాడు ఎంపీటీసీ అభ్యర్థులు నాగిరెడ్డి మణికుమారి, వందే వెంకటలక్ష్మి సైతం నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకున్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారంలో పాల్గొనడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో చితలపూడి సత్తిబాబు, పల్లాటి దుర్గారావు, మేడిశెట్టి ఈశ్వరరావు, కాయల రాంబాబు, గారపాటి సతీష్, వనమాలి వీర కృష్ణ, మార్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, గంగరాజు రమణ, జెట్టుగు నారాయుడు, రల్లి లోవరాజు, దూడే శివ సుబ్రహ్మణ్యం, కార్రి చిన్నబాబు, పెనిమర్తి అబ్బు తదితర నాయకులు, గ్రామ పెద్దలు, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.