యాలాల,మేజర్ న్యూస్: మండలంలో వర్షాభావంతో పంటలు ఎండిపోతుండటంతో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మండలంలోని ఎండిన పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు.బుగ్గప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవక పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు పంట నష్టాలతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి,వికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు పంట రుణాల విషయంలో ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా రైతులను ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్,హన్మంతు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.