టి.నరసాపురం ఎంపీటీసీ-1 అభ్యర్థిగా నాయుడు సాయిమ్మ విస్తృత ప్రచారం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి
ఏలూరు జిల్లా, టి.నరసాపురం, మేజర్ న్యూస్:టి.నరసాపురం ఎంపీటీసీ-1 అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయుడు సాయమను ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం మండల నాయకులు దేవరపల్లి సీతారామయ్య అభ్యర్థితో కలిసి టి.నరసాపురం పంచాయతీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని, తనకు మద్దతు తెలిపి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని, ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నట్లు ఓటర్లకు తెలియజేశారు.టి.నరసాపురం పంచాయతీ పరిధిలో ఓటర్లను నేరుగా కలుసుకుంటూ తన అభ్యర్థిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. ప్రచారంలో పలువురు వైయస్సార్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు,