BREAKING
వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం

ముగిసిన జిల్లా స్థాయి అథ్లెటిక్, చెస్ పోటీలు

Select Suryaa Now
ముగిసిన జిల్లా స్థాయి అథ్లెటిక్, చెస్ పోటీలు

*నారాయణపేట, సూర్యన్యూస్* :  నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద రాజులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అథ్లెటిక్ పోటీల కోసం రోజు శ్రమిస్తే శారీరకంగా దృడంగా ఉండటమే కాకుండా అన్నింటిలో చురుకుగా ఉంటారని,జిల్లాలోని క్రీడాకారులు బాగా రాణించి రాష్ట్ర జాతీయ స్థాయి లో పాల్గొని జిల్లాకు మంచిపేరు తీసుకుని రావాలని కోరారు. ఈ సందర్భంగా  అండర్ 14, అండర్ 17 విభాగాలలో పరుగు పందెం 100, 200, 400 మీటర్ల పోటీలు, లాంగ్ జంప్,హై జంప్,డిస్కస్ త్రో మరియు షాట్ పుట్ పోటీలు నిర్వహించారు.ఇందులో విజేతలైన వారు మహబూబ్ నగర్ లో జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో నారాయణపేట జిల్లా తరుపున పాల్గొంటారని ఎస్ జి ఎఫ్ నారాయణపేట జిల్లా సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణపేట జిల్లా స్థాయి చెస్ పోటీలను పాఠశాల హెచ్ ఎం మొహమ్మద్ హనీఫ్ తో కలిసి ఎస్జిఎఫ్ నారాయణపేట జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి  ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్ మాట్లాడుతూ చదరంగం ఆట అనేది ఏకాగ్రతతో కుదుకున్నదని దీనిని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వలన విద్యార్థులు చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయని అన్నారు,ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చదరంగం ఆట అనేది పురాణాల కాలం నుండి రాజులు ఆడేవారని చరిత్ర ప్రకారం రావణుని భార్య మందోదరి చదరంగం ఆట తన చెలికత్తెలతో ఆడేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాద్యాయులు మోహన్, వ్యాయమ ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, నర్సిములు, నెల్సన్, రత్నయ్య, రమణ, బాలరాజు, వెంకటప్ప, సాయినాథ్, అనంత సేన, రామకృష్ణ రెడ్డి, పారిజాత, పర్వీన్ బేగం, అక్తర్ పాషా, కృష్ణవేణి, బీరప్ప, రాధిక, బసంత్ రెడ్డి, విద్య సాగర్, శ్రీవాణి, రాజేష్  పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.