రేపు సంగారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం.
సంగారెడ్డి, : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం (అక్టోబర్ 27) సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం విడుదల చేసింది.షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని హిమాయత్ సాగర్ వద్ద ఉన్న తన నివాసం నుంచి మంత్రి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10:20 గంటలకు సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుంటారు.ఉదయం 10:30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ఇన్‌చార్జి మంత్రి, ప్రజాప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ, భూ సర్వే, రిజిస్ట్రేషన్, స్టాంపులు, గృహ నిర్మాణ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.సమీక్ష అనంతరం సంగారెడ్డిలోని అతిథి గృహంలో కొద్దిసేపు బస చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి, మధ్యాహ్నం 3:30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.మంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.