telangana
పార్టీలకు అతీతంగా రైతాంగ శ్రేయస్సే లక్ష్యం: 'భారతీయ కిసాన్ సంఘ్' ప్రస్థానం
సూర్య తాడ్వాయి, ;;దేశానికి అన్నం పెట్టే రైతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. రైతులు రాత్రింబగళ్లు కష్టపడి దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నప్పటికీ, మార్కెట్‌లో వారికి సరైన విలువ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతీ గ్రామంలో పార్టీలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేసేలా రైతులు కృషి చేయాలని కోరారు. రైతులు బాగుంటునే దేశం బాగుంటుందని, రైతులు ఐక్యంగా పోరాటాలు చేస్తే ఏ ప్రభుత్వాలైన దిగివస్తాయాని తెలిపారు.ప్రధాన డిమాండ్లు: రుణమాఫీ: అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని వడ్డీతో సహా పక్కాగా అమలు చేయాలి.
రైతు బీమా: రైతు బీమాను రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలి.గిట్టుబాటు ధర: పండించిన ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కల్పించి, దళారీ వ్యవస్థను అరికట్టాలి.ప్రభుత్వాలు ఏవైనా, రాజకీయాలు ఏవైనా సరే.. రైతు ప్రయోజనాలే పరమావధిగా భారతీయ కిసాన్ సంఘ్ సాగిస్తున్న పోరాటం అభినందనీయం. అన్నదాతకు అండగా నిలుస్తూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి మరియు గ్రామీణ భారత సముద్ధరణకు కిసాన్ సంఘ్ చేస్తున్న కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవ అధ్యక్షులు దేవి రెడ్డి విట్టల్ రెడ్డి, సభ్యులు సంతోష్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, నర్సా రెడ్డి, సంగ రెడ్డి తదితరులు పాల్గోన్నారు