భూ సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి
యాలాల, మేజర్ న్యూస్: భూ సమస్యను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కేవీపీఎస్,వ్యవసాయ కార్మిక సంఘం,ఎంఆర్‌పీఎస్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు.బుగ్గప్ప మాట్లాడుతూ..భూ సమస్యలతో రైతులు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకులు డప్పు మహేందర్,కేవీపీఎస్ నాయకులు నర్సిములు,లాలప్ప,అనిల్‌తో పాటు భూ బాధితులు బాలరాజ్,చంద్రమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.