BREAKING
వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం

ఆరోగ్య మంత్రితో మాట్లాడతా.......ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Select Suryaa Now
ఆరోగ్య మంత్రితో మాట్లాడతా.......ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;;;కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఎన్ ఎచ్ ఎం -జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా కలెక్టరేట్ రహదారిలోని అడ్లూర్ రోడ్డు కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఆలకించి నెరవేర్చాలని వేడుకున్నారు.అనంతరం పలువురు జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని కలిసి తమ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు. తాము 14రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె విషయాలను వివరించారు. రాష్ట్రంలో 17400 పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారని 25 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం ఉన్నారని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్తానని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి చర్చిస్తానని హామీ ఇచ్చారు. 
సమ్మె శిబిరాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. మహిళా ఉద్యోగులు సైతం సమ్మెలో ఉండటం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే విధంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేప చేపట్టకపోవడాన్ని ఉద్యోగులకు నిరాశకు కలగజేస్తుందని ఆమె అన్నారు. బీసీ సంఘం నాయకులు డాక్టర్ రమేష్ బాబు సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లమై ఉండి రోడ్డెక్కి సాధించుకున్నామని, స్వరాష్ట్రంలో సైతం ఆరోగ్యశాఖ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాటం చేయడం బాధాకరమని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేసే నిరోధిక సమ్మెకు తమ సంఘం తరఫున చేయూతనందిస్తామని, పోరాటంలో భాగస్వామ్యం అవుతామని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు విశ్రమించమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ ఎచ్ ఎం జేఏసీ అధ్యక్షుడు సుమన్, జేఏసీ నాయకులు డా.మారుతి, డా.హరీష్, డా.మనోజ్, డా.రాహుల్, డా.శ్రావణి వెంకటరమణ, మౌనిక, జ్యోతి, సత్తవ్వ,గౌతమి, నవీన్, రామచంద్రం, విజయ్ కుమార్, రాజమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.