పాంబండలో వైభవంగా పౌర్ణమి గిరి ప్రదక్షిణ
కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల లోని కొలువైన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సోమవారం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం రుద్ర హోమాన్ని నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో పాంబండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో అర్చకులు పాండు శర్మ, భక్తులు పాల్గొన్నారు.