BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

భూసంరక్షణతోనే భవిష్యత్ వ్యవసాయానికి భరోసా:మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి ప్రభాకర్

Select Suryaa Now
భూసంరక్షణతోనే భవిష్యత్ వ్యవసాయానికి భరోసా:మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి ప్రభాకర్

కుల్కచర్ల, మేజర్ న్యూస్:భూసంరక్షణతోనే భవిష్యత్ వ్యవసాయానికి భరోసా కల్పిస్తుందని ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ తెలిపారు. సోమవారం కుల్కచర్ల మండలం కుసుమసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఖేతీ బచావో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూసంరక్షణ ప్రాముఖ్యత, భూసారాన్ని కాపాడుకునే పద్ధతులు, నేల కోత నివారణ, నీటి వనరుల సంరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో, వర్షపాతంలో సంభవించే మార్పులు వ్యవసాయంపై చూపే ప్రభావాలను వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, భూసారాన్ని కాపాడే వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. రైతులు ప్రకృతి వనరులను సంరక్షిస్తూ, వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంటల దిగుబడిని మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ కుమార్, నాయకులు దేవుజ్య నాయక్, లాలు, ఏఈఓ నిఖిత, హార్టికల్చర్ శాఖ అధికారి లక్ష్మయ్య, ఎఫ్ పిఓ మురళి, పంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, వెంకట్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.