పండుగలు ముగిసినా.. మండపాలు తొలగించరా? కడియంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో అసహనం!
కడియం ,మేజర్ న్యూస్,వినాయక చవితి నవరాత్రులు ముగిసి, దేవీ నవరాత్రులు కూడా పూర్తయినా మండల కేంద్రం కడియం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు మండపాలను ఇప్పటికీ తొలగించకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పండుగలు ముగిసినప్పటికీ మండపాలు అలాగే దర్శనమిస్తుండటంతో సంబంధిత అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా పండుగలు పూర్తయిన వెంటనే మండపాలను తొలగించి ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే కడియం గ్రామంలో మాత్రం నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలు ఇంకా తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది.మండపాల తొలగింపుపైy ప్రజలు కోరుతున్నారు. పండుగల నిర్వహణకు అనుమతులు, ఏర్పాట్లపై చూపుతున్న శ్రద్ధ.. పండుగలు ముగిసిన తర్వాత కూడా కనిపించాలని వారు సూచిస్తున్నారు.