BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి :అక్టోబర్ 27, 28 తేదీల్లో విద్యాసంస్థలు, అంగన్‌వాడీలకు సెలవు :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

Select Suryaa Now
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి :అక్టోబర్ 27, 28 తేదీల్లో  విద్యాసంస్థలు, అంగన్‌వాడీలకు సెలవు :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

కడియం ,మేజర్ న్యూస్ ,భారీ నుంచి అతి భారీ వర్షాలు, తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తంగా ఉంచాలని, వర్షాలు, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యుత్, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రెండు రోజులు స్థానిక సెలవు
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూనే ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు:
జిల్లా కలెక్టరేట్, రాజమహేంద్రవరం: 08832-944455
సబ్‌ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం: 08832-442344
ఆర్డీవో కార్యాలయం, కొవ్వూరు: 08813-231488
భారీ వర్షాలు, వరదలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.