BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు

Select Suryaa Now
అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు

అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం

ఎస్ఓ టు జీఎం డి.వి. రామారావు

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్): సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచనల మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు-2026 ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించబడనున్నట్లు ఎస్వో టు జిఎం డి.వి రామారావు తెలిపారు. ఈ ఏడాది సమృద్ధి కోసం నిజాయితీ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం సంస్థలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతో పాటు అవినీతి నిర్మూలనపై ఉద్యోగులు, అధికారులు, ప్రజల్లో అవగాహన కల్పించడమన్నారు.
ఈ సందర్భంగా మణుగూరు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంతో పాటు వివిధ గనులు, డిపార్ట్ మెంట్లలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉద్యోగులకు నైతిక విలువలు, అవినీతి నిరోధక చర్యలు, విధి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అవినీతి రహిత సంస్థ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం మాట్లాడుతూ..అవినీతిని అరికట్టడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని, విధి నిర్వహణలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ సంస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి, సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థలో పారదర్శకతను పెంపొందించి, అవినీతిని అరికట్టాలనే లక్ష్యంతో  చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం ఉద్యోగులకు మెరుగైన జీతభత్యాలు, అనేక సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని, అవినీతికి సంబంధించిన అంశాలు తమ దృష్టికి వచ్చినప్పుడు వాటిని సంబంధిత అధికారులకు తెలియజేయడాన్ని నైతిక బాధ్యతగా భావించాలని అన్నారు.రిక్రూట్మెంట్, కొనుగోళ్లు, బొగ్గు రవాణా, కాంట్రాక్టులు, ఇతర సంస్థాగత కార్యకలాపాల్లో అవినీతికి ఎలాంటి అవకాశం లేకుండా అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మణుగూరు ఏరియాను అవినీతి రహిత ఏరియాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మనసా, వాచా, కర్మణా కృషి చేయాలని, 'అవినీతి రహిత సింగరేణి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి' అని పిలుపునిచ్చారు. సంస్థకు అందుబాటులో ఉన్న యంత్రాలు, మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, ప్రతిరోజూ పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులందరూ నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం ద్వారా సంస్థ పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని అన్నారు.అవినీతిని ముందుగానే నిరోధించడం, అవినీతి నిర్మూలనలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అవినీతికి పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను తెలియజేశారు.అలాగే, ఉద్యోగులలో నైతిక విలువలను పెంపొందించేందుకు, సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకతను ప్రోత్సహించేందుకు ఇంటిగ్రిటీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సింగరేణి సంస్థ అభివృద్ధి, సమర్ధవంతమైన పాలన, ప్రజల విశ్వాసం పెంపొందించడంలో నిజాయితీ కీలక పాత్ర పోషిస్తుందని, అవినీతి రహిత సంస్థ నిర్మాణానికి ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా సూచించారు.విజిలెన్స్ అవగాహన వారోత్సవాలపై మరింత అవగాహన కల్పించేందుకు సింగరేణి ఉద్యోగులతో పాటు సింగరేణి పాఠశాలల విద్యార్థులకు 'విజిలెన్స్ మన అందరి ఉమ్మడి బాధ్యత' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, డీజీఎం (పర్సనల్)  ఎస్. రమేశ్  తెలిపారు.
కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ) సి.హెచ్. రాంబాబు, ఏజీఎం (పర్సనల్)ఎస్. రమేశ్, సీఏంఓఏఐ జనరల్ సెక్రటరీ వి.మధన్ నాయక్, పర్చేస్ హెచ్డీ నాగ రమేశ్, ఏరియా సేఫ్టీ అధికారి జి. నాగేశ్వర రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి కే. శ్రీనివాస్ , ఫైనాన్స్ మేనేజర్ పి. రమేష్, సీనియర్ పర్సనల్ అధికారులు కె. శ్రీనివాస్, శ్రీ వి. రామేశ్వర రావు, ఏఐటీయూసీ ప్రతినిధులు రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.