పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం
లక్ష్మీదేవిపల్లి, సూర్య;- కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.జనసేన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, పుదారి శ్యామ్ ఆధ్వర్యంలో సోమవారం నమోదు కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం గణేష్ టెంపుల్ ఏరియాలో, బుధవారం సూపర్ బజార్లో ఈ ఉచిత నమోదు కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గత మూడు రోజులుగా కోర్టు లైబ్రరీలో కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్లు అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో జివిఆర్ ప్రసాద్, కరుణాకర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.