BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Select Suryaa Now
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

 

సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, కాముని శ్రీనివాసులు విమర్శించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేపట్టకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, పండించిన పంటను దళారులకు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మన్లు కోల రమేష్‌ గౌడ్, నల్ల నరేందర్‌ రెడ్డి, ములకల కనకరాజు, నాయకులు రవీందర్‌ రెడ్డి, ప్రభాకర్‌ వర్మలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే పరిస్థితి లేదని విమర్శించారు.

వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గతంలో క్వింటాల్‌ ధాన్యానికి రూ.2,400 వరకు చెల్లించిన వ్యాపారులు, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం రూ.1,800కే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

సాగునీరు సక్రమంగా అందించకపోవడంతో పంట దిగుబడులు తగ్గాయని, కనీసం చేతికొచ్చిన పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతు భరోసా సకాలంలో అందించలేదని, రైతు బీమా, రుణమాఫీ అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు వాటిని సకాలంలో పునరుద్ధరించడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతుల నుంచి పంటను మద్దతు ధరకు సేకరించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో నాయకులు కీసర పాపయ్య, బెదురు తిరుపతి, కాముని ఉమేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.