బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 10,14 వార్డులలో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తన అపార అనుభవంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో కోట్లాది రూపాయలువెచ్చించి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ గా పోటీ చేస్తున్న దొడ్ల విజయలక్ష్మి గతంలో బుచ్చిరెడ్డిపాలెం ఎంపిపిగా, వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్ పర్సన్ గా సేవలందించిన అనుభవం ఉండడంతో ఆమెను బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆమెను మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నుకుంటే మునిసిపాలిటీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్ళవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా తమ ప్రాంతంలోని ఎంపిటిసి అభ్యర్థిని కూడా తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించుకొని అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం సమన్వయకర్త కోడూరు కమలాకర్ రెడ్డి, ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి,బుచ్చి రెడ్డిపాలెం టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా, శ్రీనివాసులు, టిడిపి నాయకులు కెవి శేషయ్య, మోర్ల మురళి, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.