పద్మశాలి సంఘం మెదక్ యూత్ అధ్యక్షునిగా పోల నవీన్ కుమార్ నియామకం.
కౌడిపల్లి;తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మెదక్ జిల్లా యూత్ అధ్యక్షునిగా మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన పోల నవీన్ కుమార్ నియమితులయ్యారు. సోమవారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ మెదక్ జిల్లా అధ్యక్షుడు మేకల జయరాములు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పోల నవీన్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ నియామకం పట్ల మెదక్ జిల్లాకు చెందిన పద్మశాలిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కౌడిపల్లి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిసికే నర్సింలు, బొడ్డు పెంటయ్య, సాలె శ్రీనివాస్, నరేందర తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చెందిన పద్మశాలి లో మండల కౌడిపల్లి మండల అధ్యక్షుడు పిసికే నర్సింలు కార్యకర్తలు పాల్గొన్నారు