telangana
"శనార్తి" షూటింగ్ ను సందర్శించిన సిపి ఎమ్మెల్యే సత్యం.
సూర్య రామడుగు ;;రామడుగు మండలం వెలిచాల గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శనార్తి సినిమా షూటింగ్ ను సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించి పరిశీలించారు. అనంతరం సినిమాలో నటిస్తున్న హీరో అఖిల్ రాజ్ హీరోయిన్ నాగ దుర్గ దర్శకులు గణేష్ శ్రీధర్ రెడ్డి చైతన్యలతో కాసేపు ముచ్చటించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించి సినిమా యూనిట్ సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట సర్పంచ్ వీర్ల నర్సింగరావు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.